శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో డిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-09-30T22:15:46+05:30 IST

తిరుపతి(Tirupati)లోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(Sri Venkateswara University) దూరవిద్యా విభాగం - వివిధ ప్రోగ్రాములలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో డిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌లు

తిరుపతి(Tirupati)లోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(Sri Venkateswara University) దూరవిద్యా విభాగం - వివిధ ప్రోగ్రాములలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. లేటరల్‌ ఎంట్రీ కూడా ఉంది. అడ్మిషన్స్‌ పొందిన అభ్యర్థులందరికీ సంబంధిత స్టడీ మెటీరియల్‌ అందిస్తారు.


డిగ్రీ ప్రోగ్రామ్‌లు

బీఎస్సీ గ్రూప్‌లు: బీజడ్‌సీ, ఎంపీసీ, ఎంఎస్‌సీఎస్‌, ఎంపీఈ, ఎంఈసీఎస్‌, ఎంపీసీఎస్‌.

బీకాం గ్రూప్‌లు: జనరల్‌, కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌ 

బీఏ గ్రూప్‌లు: హెచ్‌ఈపీ, హెచ్‌పీఈ, హెచ్‌పీపీ, హెచ్‌పీటీ, ఎస్‌హెచ్‌పీ, పీఎ్‌సపీ.

అర్హత: బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల వ్యవధి మూడేళ్లు. వీటికి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌(బీఎల్‌ఐఎస్సీ) కోర్సు వ్యవధి ఏడాది. దీనికి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బీఏ, బీకాం(జనరల్‌) ప్రోగ్రామ్‌లను ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో; బీకాం(కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌), బీఎస్సీ ప్రోగ్రామ్‌లను ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవచ్చు.


పీజీ ప్రోగ్రామ్‌లు

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఎంబీఏ ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(ఎంఎల్‌ఐఎస్సీ) వ్యవధి ఏడాది. ఈ ప్రోగ్రామ్‌లన్నీ ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి.

ఎంఏ స్పెషలైజేషన్‌లు: తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌.

ఎంకాం స్పెషలైజేషన్‌లు: కామర్స్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు: మేథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, సైకాలజీ

అర్హత: ఎంఏలో తెలుగు/ఇంగ్లీష్/హిందీ/ఎకనామిక్స్‌లకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ; మిగిలినవాటికి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎమ్మెస్సీలో మేథమెటిక్స్‌కు బీఏ/బీఎస్సీ (మేథ్స్‌); కంప్యూటర్‌ సైన్స్‌కు బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌) లేదా బీఏ/బీకాం బీఎస్సీ(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా ఏదేని డిగ్రీతోపాటు పీజీడీసీఏ లేదా బీఈ/బీటెక్‌/బీసీఏ; ఫిజిక్స్‌కు బీఎస్సీ(మేథ్స్‌, ఫిజిక్స్‌); సైకాలజీకి ఏదేని డిగ్రీ; మిగిలినవాటికి సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌ ఎంకాం కోర్సుకు బీకాం/బీఏ(కామర్స్‌); ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌కు బీకాం/బీబీఎం/బీసీఏ/బీఏ(ఏఈఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏకు కూడా ఏదేని డిగ్రీ పాసైతే చాలు. ఎంఎల్‌ఐఎస్సీకి బీఎల్‌ఐఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/బోటనీ/జువాలజీ) అభ్యర్థులకు తిరుపతి స్టడీ సెంటర్లో నెలరోజులపాటు కాంటాక్ట్‌ తరగతులు నిర్వహిస్తారు. వీటికి అభ్యర్థులు తప్పనిసరిగా హాజరుకావాలి.


పీజీ డిప్లొమా

స్పెషలైజేషన్‌లు: ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ అండ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌

అర్హత: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. మొదటి స్పెషలైజేషన్‌కు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండోదానికి బీఏ/ఎంఏ/ఎమ్మెస్సీ(సైకాలజీ/ ఎడ్యుకేషన్‌/ సోషల్‌ వర్క్‌/ హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌)/బీఎస్సీ(నర్సింగ్‌) అభ్యర్థులు అర్హులు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.200

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 25

వెబ్‌సైట్‌: www.svudde.in

Read more