ఉస్మానియా వర్సిటీలో డిస్టెన్స్‌ కోర్సులు

ABN , First Publish Date - 2022-09-30T21:03:59+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆధ్వర్యంలోని ప్రొఫెసర్‌ జీ.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ - దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా

ఉస్మానియా వర్సిటీలో డిస్టెన్స్‌ కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆధ్వర్యంలోని ప్రొఫెసర్‌ జీ.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ - దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ, బీబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. 


ఎంబీఏ, ఎంసీఏ

  • ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు ఇంటర్‌ లేదా డిగ్రీ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. టీఎస్‌ ఐసెట్‌ 2022/ ఏపీ ఐసెట్‌ 2022/ పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 
  • పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. అనలిటికల్‌ ఎబిలిటీ సెక్షన్‌లో డేటా సఫిషియెన్సీ నుంచి 10, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 25 ప్రశ్నలు; మేథమెటికల్‌ ఎబిలిటీ సెక్షన్‌లో అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 20, ఆల్జీబ్రకల్‌ అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి 15, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 5 ప్రశ్నలు; కమ్యూనికేషన్‌ ఎబిలిటీ సెక్షన్‌లో ఒకాబులరీ, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టర్మినాలజీ, ఫంక్షనల్‌ గ్రామర్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 5 ప్రశ్నలతోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం ప్రశ్నలు 100. పరీక్ష సమ యం గంటన్నర. అభ్యర్థులు బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రంమీద సమాధానాలు గుర్తించాలి.  

దరఖాస్తు ఫీజు: రూ.900

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 4

పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: అక్టోబరు 12

ప్రోగ్రామ్‌ ఫీజు: ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.10,000; ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.7,500


డిగ్రీ: ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. బీఏ, బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌), బీకాం(జనరల్‌), బీబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) ప్రోగ్రామ్‌నకు మాత్రం ఇంటర్‌ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. 

ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు: బీఏ, బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌)ప్రోగ్రామ్‌లకు రూ.4,000; బీకాం(జనరల్‌)కు రూ.5,000; బీబీఏకు రూ.8,000

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. మేథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000. బయోఇన్ఫర్మాటిక్స్‌ స్పెషలైజేషన్‌కు ద్వితీయశ్రేణి మార్కులతో బీఎస్సీ/ బీఎస్సీ(అగ్రికల్చర్‌)/ ఎమ్మెస్సీ/ బీఫార్మసీ/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఏఎంఎ్‌స/బీయూఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఈ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.30,000. 

  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ స్పెషలైజేషన్‌కు ప్రోగ్రామ్‌ ఫీజు సెమిస్టర్‌కు రూ.8,000. డేటా సైన్స్‌కు సెమిస్టర్‌కు రూ.10,000. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌కు సెమిస్టర్‌కు రూ.7,500. వేదిక్‌ ఆస్ట్రాలజీకీ ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000. ఈ స్పెషలైజేషన్‌లన్నింటికీ ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. 


ఎంఏ

ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఉర్దూ, హిందీ, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్‌, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ స్పెషలైజేషన్‌లకు బీఈ/ బీటెక్‌/ బీసీఏ సహా ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, స్పెషలైజేషన్‌లకు సంబంధిత సబ్జెక్ట్‌లతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎకనామిక్స్‌ స్పెషలైజేషన్‌కు బీకాం అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు: ఇంగ్లీష్‌కు రూ.6,500; సైకాలజీకి రూ.9,000; మిగిలిన స్పెషలైజేషన్‌లకు రూ.6,000

ఎమ్మెస్సీ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మేథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌కు డిగ్రీ(మేథమెటిక్స్‌); స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌కు డిగ్రీ(మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు: మేథమెటిక్స్‌కు రూ.6,500; స్టాటిస్టిక్స్‌కు రూ.6,000

ఎంకాం: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. బీకాం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు ఏడాదికి రూ.6,500


అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా: ఇందులో స్పెషలైజేషన్‌ వేదిక్‌ ఆస్ట్రాలజీ. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. పీజీ డిప్లొమా(వేదిక్‌ ఆస్ట్రాలజీ) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000 

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగ: ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. పదోతరగతి/ మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31 

వెబ్‌సైట్‌: www.oucde.net

Read more