హోటెల్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీలో రాణించాలంటే ఏం చేయాలి.. అమ్మాయిలకు ఈ ఆప్షన్‌ సరైనదేనా?

ABN , First Publish Date - 2022-01-03T19:41:13+05:30 IST

సాధారణంగా పక్కన ఉన్నవారు ఏది బాగుంది అంటే పిల్లలు అదే బాగుంది అంటుంటారు. కొంత వయస్సు వచ్చిన తరవాతే వారికి సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పటి వరకు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం బెటర్‌

హోటెల్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీలో రాణించాలంటే ఏం చేయాలి.. అమ్మాయిలకు ఈ ఆప్షన్‌ సరైనదేనా?

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. తనకు చెఫ్‌ కావాలని కోరిక. ఆమె చాయిస్‌ సరైనదేనా?

- శోభ, అనంతపురం


సాధారణంగా పక్కన ఉన్నవారు ఏది బాగుంది అంటే పిల్లలు అదే బాగుంది అంటుంటారు. కొంత వయస్సు వచ్చిన తరవాతే వారికి సొంత అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పటి వరకు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం బెటర్‌. అంతేకాకుండా కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను ఇంటర్మీడియెట్‌ తరవాత తీసుకోవడం మంచిది.  ఇక ఇంటిలో వంటలు చేయడం పట్ల ఉన్న ఆసక్తి కెరీర్‌గా ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పలేం. 

హోటెల్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీలో రాణించాలంటే కుకింగ్‌ ఆసక్తితోపాటు అదనపు లక్షణాలు ఉండాలి. కస్టమర్ల ఆసక్తులు, సీజన్లు, ప్రాంతాల అభిరుచులు, ఓపిక, ఎక్కువ సమయం నిలబడగలిగే శారీరక సామర్థ్యం తదితరాలన్నీ కలిస్తేనే ఇందులో రాణిస్తారు. భారతీయుల విషయానికి వస్తే నాన్‌వెజ్‌ అంటే చికెన్‌, మటన్‌ మాత్రమే అనుకుంటారు. ఇంటర్నేషనల్‌ చెఫ్‌గా పనిచేయాలనుకునే వ్యక్తులు పలు రకాల మాంసాలతో వంటలు చేయాల్సి ఉంటుంది. పని పరిస్థితులపై అవగాహన ఏర్పరుచుకున్న తరువాతనే ఇలాంటి కెరీర్‌ను ఎంచుకుంటే బెటర్‌. ఇక్కడ అడ్జెస్ట్‌ కాలేకుంటే ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ రిలేషన్స్‌ తదితరాలకు మళ్లాల్సి వస్తుంది. ఇంటర్‌ పూర్తిచేసిన తరువాత హోటెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పలు కాలేజీలు అందిస్తున్నాయి. 


గోవర్ధనం కిరణ్‌కుమార్‌


Read more