TMCలో సర్టిఫికెట్‌ కోర్సు

ABN , First Publish Date - 2022-09-17T21:48:56+05:30 IST

టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌(Tata Memorial Hospital) - ‘సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ హాస్పిటల్‌ ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి ఆరు వారాలు. డాక్టర్లు, నర్సులు, హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు

TMCలో సర్టిఫికెట్‌ కోర్సు

టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌(Tata Memorial Hospital) - ‘సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ హాస్పిటల్‌ ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి ఆరు వారాలు. డాక్టర్లు, నర్సులు, హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 15 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ఎమ్మెస్సీ నర్సింగ్‌/ పోస్ట్‌ బీఎస్సీ నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌/ డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రముఖ ఆసుపత్రులలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. అభ్యర్థుల వయసు సెప్టెంబరు 30 నాటికి 40 ఏళ్లు మించకూడదు. 


ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: 18 శాతం జీఎస్‌టీతోపాటు నాన్‌ స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు రూ.10,000; స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు రూ.15,000; ఇంటర్నేషనల్‌ అభ్యర్థులకు రూ.20,000

దరఖాస్తు ఫీజు: రూ.250

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30 

కోర్సు ప్రారంభం: నవంబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: http://tmc.gov.in

Read more