SETSలో సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-11-07T16:50:36+05:30 IST

చెన్నైలోని సొసైటీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్స్‌ అండ్‌ సెక్యూరిటీ (ఎస్‌ఈటీఎస్‌) - సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

SETSలో సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తులు
సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తులు

చెన్నైలోని సొసైటీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్స్‌ అండ్‌ సెక్యూరిటీ (ఎస్‌ఈటీఎస్‌) - సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు వారాలు. ఇది ఫుల్‌ టైం కోర్సు. సైన్సెస్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, టీచింగ్‌ ఫ్యాకల్టీ, రిసెర్చర్స్‌, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఈ ప్రోగ్రామ్‌ ఉపయుక్తంగా ఉంటుంది. అకడమిక్‌ ప్రతిభ, ఎస్‌ఈటీఎస్‌ అకడమిక్‌ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు: ఇందులో సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీ, టూల్స్‌ సంబంధిత అంశాలు వివరిస్తారు. సైబర్‌ దాడులనుంచి నెట్‌వర్క్‌ సిస్టమ్‌లను కాపాడే విధానాలు, లేటెస్ట్‌ టూల్స్‌ వినియోగంపై శిక్షణ ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు థియరీ, ప్రాక్టిల్‌ సెషన్స్‌ ఉంటాయి. ప్రోగ్రామ్‌లో సైబర్‌ సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్‌, క్రిప్టోగ్రఫీ అండ్‌ పబ్లిక్‌ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌, అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ అనే మాడ్యూల్స్‌ ఉంటాయి. ప్రోగ్రామ్‌ చివరలో రెండు వారాలు ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటుంది. తరవాత ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లు, సబ్జెక్టివ్‌ టెస్ట్‌లు, ల్యాబ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మార్కులు సాధించినవారికి సర్టిఫికెట్‌లు ప్రదానం చేస్తారు.

అర్హత: (బీఈ/ బీటెక్‌)(ఈసీఈ/ సీఎ్‌సఈ/ ఈఈఈ/ ఈఐఈ/ ఐటీ) పూర్తిచేసినవారు; ఎమ్మెస్సీ(ఎలకా్ట్రనిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, ఐటీ)/ ఎంసీఏ ఉత్తీర్ణులు; డిప్లొమా హోల్డర్లు, సైన్స్‌ గ్రాడ్యుయేట్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలకా్ట్రనిక్స్‌, నెట్‌వర్కింగ్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ప్రోగ్రామింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై అవగాహన తప్పనిసరి.

కోర్సు ఫీజు: రూ.23,600

చివరి తేదీ: నవంబరు 11

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: నవంబరు 21

కోర్సు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: నవంబరు 30

కోర్సు ప్రారంభం: డిసెంబరు 1 నుంచి

కోర్సు పూర్తయ్యే తేదీ: డిసెంబరు 30

కోర్సు వేదిక: సొసైటీ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ ట్రాన్సాక్షన్స్‌ అండ్‌ సెక్యూరిటీ(ఎస్‌ఈటీఎస్‌), ఎంజీఆర్‌ నాలెడ్జ్‌ సిటీ, సీఐటీ క్యాంపస్‌, తారామణి, చెన్నై - 600113.

వెబ్‌సైట్‌: www.setsindia.in

Updated Date - 2022-11-07T16:50:36+05:30 IST

Read more