రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రగతి

ABN , First Publish Date - 2022-06-07T21:27:51+05:30 IST

పదో తరగతిలో కేవలం 67 శాతం ఉత్తీర్ణులు కావడం, 71 పాఠశాలల్లో నూరు శాతం ఫెయిల్‌ కావడం...చూస్తుంటే రాష్ట్రంలో విద్యా ప్రగతి పూర్తిగా దిగజారినట్టుగా ఉంది. ఆంధ్రను నిరక్షరాస్య రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చారా?’’ అని విద్యా శాఖ మాజీ మంత్రి

రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రగతి

విశాఖపట్నం, జూన్‌ 6: ‘‘పదో తరగతిలో కేవలం 67 శాతం ఉత్తీర్ణులు కావడం, 71 పాఠశాలల్లో నూరు శాతం ఫెయిల్‌ కావడం...చూస్తుంటే రాష్ట్రంలో విద్యా ప్రగతి పూర్తిగా దిగజారినట్టుగా ఉంది. ఆంధ్రను నిరక్షరాస్య రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చారా?’’ అని విద్యా శాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘విద్యా రంగంలో ఏటా సుస్థిర, గణనీయమైన ప్రగతి సాధించిన చరిత్రను పాతరేశారు. నాణ్యమైన విద్యనందించడంలో మొదటి నుంచి మూడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని, చివరి నుంచి మూడో స్థానానికి దిగజార్చారు’ అని విమర్శించారు. ఒక డీఎస్సీ లేదు, ఓరియంటేషన్‌ లేదు, ప్రణాళిక లేదు.. అని ఆరోపించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యా శాఖ మాజీ మంత్రిగా తన సహకారం కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

Read more