దారుణం: ఫీజు కట్టలేదని విద్యార్థుల నిర్బంధం

ABN , First Publish Date - 2022-08-25T20:41:30+05:30 IST

స్కూలు ఫీజు కట్టలేదని ఒడిసాలోని ఒక పాఠశాల దారుణానికి ఒడిగట్టింది. 34 మంది విద్యార్థులను ఐదు గంటల పాటు గదిలో నిర్బంధించింది. ఆలస్యంగా

దారుణం: ఫీజు కట్టలేదని విద్యార్థుల నిర్బంధం

ఒడిసాలో ఘటన.... పోలీసు కేసు నమోదు


భువనేశ్వర్‌, ఆగస్టు 24: స్కూలు ఫీజు(School fees) కట్టలేదని ఒడిసాలోని ఒక పాఠశాల దారుణానికి ఒడిగట్టింది. 34 మంది విద్యార్థులను ఐదు గంటల పాటు గదిలో నిర్బంధించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భువనేశ్వర్‌లోని ఈ ప్రైవేట్‌ పాఠశాల(Private school)లో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు 34 మంది స్కూలు ఫీజు కట్టలేదు. దాంతో వారందరినీ లైబ్రరీలోకి పిలిపించి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ నిర్బంధించారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూలు ఎదుట నిరసనలకు దిగారు. 

Read more