11న అంబేడ్కర్‌ వర్సిటీ MBA ఎంట్రన్స్‌

ABN , First Publish Date - 2022-09-10T20:19:39+05:30 IST

డా.బి.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ(Ambedkar Universal University) (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌) స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎంట్రన్స్‌ పరీక్షను విశ్వవిద్యాలయ ప్రధాన

11న అంబేడ్కర్‌ వర్సిటీ MBA ఎంట్రన్స్‌

స్పాట్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం


హైదరాబాద్‌ సిటీ: డా.బి.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ(Ambedkar Universal University) (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌) స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎంట్రన్స్‌ పరీక్షను విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేక పోయిన అభ్యర్థులకు స్పాట్‌ రిజిస్ర్టేషన్‌(Spot Registration) సౌకర్యం కల్పించినట్ల కామర్స్‌ విభాగ డీన్‌ ప్రొ. ఆనంద్‌ పవార్‌ తెలిపారు. అభ్యర్థులు జనరల్‌, బీసీ కేటగిరి వాళ్లయితే రూ.1700 (ఆలస్య రుసుం, రిజిస్ర్టేషన్‌ ఫీజు కలిపి), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1300 డిమాండ్‌ డ్రాప్ట్‌ పాటు ఈ నెల 11న ఉదయం 9 గంటలకు యూనివర్పిటీ ప్రధాన కార్యాలయానికి రావాలన్నారు. ఐడీ ప్రూఫ్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు సహా అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలన్నారు.

Read more