టీచర్లు లేరు.. పాఠాలు జరగట్లేదు! హైకోర్టుకు విద్యార్థులు లేఖలు!

ABN , First Publish Date - 2022-02-19T17:46:15+05:30 IST

ఉపాధ్యాయులు లేరు.. పాఠాలు సరిగ్గా జరగట్లేదు.. నీతులు చెబుతూ తిరిగే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. దీంతో, పాఠాలు చెప్పే టీచర్లు లేకపోతే ఇక బడికి వెళ్లేది ఎందుకు? అని ఆవేదన చెందుతున్నారు ఆ పాఠశాల విద్యార్థులు...

టీచర్లు లేరు.. పాఠాలు జరగట్లేదు! హైకోర్టుకు విద్యార్థులు లేఖలు!

గట్టు, ఫిబ్రవరి 18: ఉపాధ్యాయులు లేరు.. పాఠాలు సరిగ్గా జరగట్లేదు.. నీతులు చెబుతూ తిరిగే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. దీంతో, పాఠాలు చెప్పే టీచర్లు లేకపోతే ఇక బడికి వెళ్లేది ఎందుకు? అని ఆవేదన చెందుతున్నారు ఆ పాఠశాల విద్యార్థులు. చివరి ప్రయత్నంగా తమ ఆవేదనను వివరిస్తూ హైకోర్టుకు లేఖలు రాశారు. వెంటనే టీచర్లను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామ విద్యార్థులు శుక్రవారం ఈ లేఖలు రాశారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇందువాసి ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని పలుమార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించడంలో ఎవరూ చొరవ చూపడంలేదని విద్యార్థులు లేఖల్లో పేర్కొన్నారు.


పీడీఎస్‌యూ నాయకుల ఆధ్వర్యంలో హైకోర్టుకు 320 మంది విద్యార్థులు పోస్టు ద్వారా తమ సమస్యలను వివరిస్తూ లేఖలు పంపారు. 320 మంది విద్యార్థులకుగాను కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో సరైన విద్య అందడంలేదని, దీంతో తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-19T17:46:15+05:30 IST