నిర్బంధాలు ఎందుకు?

ABN , First Publish Date - 2022-12-13T03:34:59+05:30 IST

చంద్రబాబు పని అయిపోయింది, ఆయనను ప్రజలు నమ్మరని మంత్రులు, రాజకీయ సలహాదారు సజ్జల, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిత్యం...

నిర్బంధాలు ఎందుకు?

చంద్రబాబు పని అయిపోయింది, ఆయనను ప్రజలు నమ్మరని మంత్రులు, రాజకీయ సలహాదారు సజ్జల, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిత్యం వ్యర్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు సభలకు వస్తున్న ఆదరణ చూసి ఆందోళనతోనే ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు పని అయిపోతే ఆయన సభలకు వెళ్ళవద్దని డ్వాక్రా మహిళలను, సంక్షేమ పథకాలు పొందుతున్న వారిని ఎందుకు కట్టడి చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి సభలే వెలవెల పోతున్నాయి. బలవంతంగా ప్రజలను తరలించినా వారు సభా కార్యక్రమం మధ్యలో వెనుదిరుగుతున్నారు. ఇదే నిజం! మరి ఎవరి పని అయిపోయినట్లు... ప్రజలు నిర్ధారించుకోవాలి?

జి. రామకృష్ణ

ఏలూరు

Updated Date - 2022-12-13T03:34:59+05:30 IST

Read more