‘ఓటు’ హక్కు మాత్రమే కాదు..

ABN , First Publish Date - 2022-11-03T03:36:36+05:30 IST

ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని...

‘ఓటు’ హక్కు మాత్రమే కాదు..

ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తన బాధ్యత తెలుసుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనందరం బాగుండాలి అనే తాపత్రయం ఉంటేనే సరిపోదు, అందుకు ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు. పోలింగ్ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. అయినా, ఓటు వేయడానికి మాత్రం పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళలేకపోతున్నాము. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ చర్చ జరుగుతోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఓటు హక్కును గౌరవంగా భావించాలి. దాన్ని గుర్తింపు కార్డుకు పరిమితం చేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్థులు కాకపోవడం, నేర చరిత్ర కలిగిన వారు కావడం ఓటర్లకు విసుగు తెప్పిస్తోంది. అందుకే, ఓటువేయడానికి ముఖ్యంగా చదువుకున్నవాళ్ళు ముందుకు రావడం లేదు. ఓటు విలువ గుర్తించనివాళ్ళే ఇటువంటి వాదనలు చేస్తుంటారు. తమ ఓటుతో మార్పు సాధించవచ్చునని ప్రతివారూ విశ్వసించినప్పుడు మార్పు కచ్చితంగా సాధ్యమే. కేవలం కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయినవాళ్లు, గెలిచిన వాళ్లు ఉన్నారు. ప్రతీ ఓటూ విలువైనదే. మార్పుకు మీ ఓటే కారణం కావచ్చేమో?

జానుశ్రీ

Updated Date - 2022-11-03T03:36:36+05:30 IST
Read more