విజయ దశమి

ABN , First Publish Date - 2022-10-05T06:46:10+05:30 IST

చెడుపైన మంచిచేయు యుద్ధమే సంబురము బాధలన్నీ తొలగిపోవు ఆనందమే అంబరము మహిషాసుర సంహారం చేసినట్టి ఆదిపరాశక్తి...

విజయ దశమి

చెడుపైన మంచిచేయు

యుద్ధమే సంబురము

బాధలన్నీ తొలగిపోవు

ఆనందమే అంబరము


మహిషాసుర సంహారం

చేసినట్టి ఆదిపరాశక్తి

ఉగ్రరూప జగద్ధాత్రి

పులకించెను ఈ ధరిత్రి


దుర్గాదేవి వీరోచితం

పది దినాల పరంపరం

జగతి శాంతి కేతనం

ప్రగతి కాంతి పతాకం


రావణ గుణవధ పర్వం

అణచబడ్డ రాక్షస గర్వం

వీరోచిత విజయాలను

తెలుపుతుంది దసరా రథం


పాండవుల ఉడుం పట్టు

ఆయుధాల అసలు గుట్టు

దాచినట్టి జమ్మిచెట్టు

పూజలందుకుంటున్నది

పుడమిపై బంగారమై ఉన్నది


స్వచ్ఛ వెలుగుపూలబుట్ట

స్వేచ్ఛ పులుగు పాలపిట్ట

రివ్వున ఎగిరి వస్తున్నది

పండుగను తిరిగి తెస్తున్నది


శరదృతువు ఆరంభం

దశమి క్రతువు సంరంభం

అసుర గణాల పరాజయం

జన గణానికి జయం జయం..!

డాక్టర్ కటుకోఝ్వల రమేష్

Read more