వెతకొద్దు

ABN , First Publish Date - 2022-12-05T00:14:36+05:30 IST

మార్దవం కోల్పోయింది. విలువ లుప్తమైపోయింది. ప్రాసంగికత ప్రహసనం...

వెతకొద్దు

మార్దవం కోల్పోయింది. విలువ

లుప్తమైపోయింది. ప్రాసంగికత

ప్రహసనం.

బరువు కరువు. గాఢత, సాంద్రత

నిరుడు కురిసిన హిమ సమూహములు.

ఆర్ద్రత అనాథ.

నమ్మకం కుంటి మంటపం. విశ్వాసం

వీధి నాటకం. ప్రేమ పేరాశ. భరోసా

బాల్యచేష్ట.

ఆశ అసువులు బాసిన జీవి. స్పర్శ

తాకుడు గుణం కోల్పోయిన తాపడం.

మాట ఇప్పుడొక కేవల వంతెన.

ఏ క్షణమైనా కుప్పకూలొచ్చు!

మోహన్‌ రుషి

Updated Date - 2022-12-05T00:14:46+05:30 IST