ఈ వారం కార్యక్రమాలు 05 12 2022

ABN , First Publish Date - 2022-12-05T00:10:55+05:30 IST

కథా విరించి కథల పోటీ ‘కరోనా కా కొహరామ్‌’ నానీలు ‘గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా’ వ్యాస సంకలనం

ఈ వారం కార్యక్రమాలు 05 12 2022

కథా విరించి కథల పోటీ

తెలుగుభారతి సంస్థ నిర్వహిస్తున్న కథా విరించి కథల పోటీలో కొత్తదనంతో పాటు, కథాకథనమూ, చదివించే గుణమూ ఉన్న కథలకు ఆహ్వానం. కథాంశం, కథ నిడివి విష యంలో ఎలాంటి పరిమితులూ లేవు. ఏ వర్గాన్ని కించపరిచే కథలు స్వీక రించబడవు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: లక్ష రూపాయలు, యాభైవేల రూపా యలు, ముప్ఫైవేల రూపాయలు పాల్గొనే వారు కథలను జనవరి 5, 2023లోగా ఈమెయిల్‌: telugubharathi2021@gmail .comకు పంపాలి

తెలుగు భారతి

‘కరోనా కా కొహరామ్‌’ నానీలు

చలపాక ప్రకాష్‌ ‘కరోనా నానీలు’కు హిందీ అనువాదం ‘కరోనా కా కొహరామ్‌’ ఆవిష్క రణ సభ డిసెంబరు 10 సా.6గం.లకు గుంటూరు పుస్తక మహోత్సవ ప్రాంగణం, ఏ.ఎల్‌.బి.ఈడి కాలేజ్‌, లాడ్జి సెంటర్‌, గుంటూరులో జరుగుతుంది. సభలో సోమే పల్లి వెంకటసుబ్బయ్య, పెనుగొండ లక్ష్మీనారా యణ, షేక్‌ కాశీంబి, వెన్నా వల్లభరావు తదితరులు పాల్గొంటారు.

అరసం (గుంటూరు)

‘గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా’ వ్యాస సంకలనం

కల్లూరి భాస్కరం వ్యాస సంకలనం ‘గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా’ ఆవిష్కరణ సభ డిసెంబరు 10 ఉ.10.30ని.లకు సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త- జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి; ముఖ్య అతిథులు- కె. రామచంద్రమూర్తి, టంకశాల అశోక్‌, కె.శ్రీనివాస్‌; పుస్తకపరిచయం- బి.పి. పడాల; సభాధ్యక్షత- శ్రీశైల్‌ రెడ్డి పంజుగుల

బుక్‌ రీడర్స్‌ క్లబ్‌

సాహిత్య స్వర్ణోత్సవ సంచిక

బులుసు కామేశ్వరరావు సంపాదకత్వంలో ‘డా. రావి రంగా రావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక’ ఆవిష్కరణ సభ డిసెంబరు 11 ఉ.10గం.లకు గుంటూరు, బ్రాడీపేట, తాలూకా ఆఫీసు ప్రాంగణంలోని పెన్షనర్ల సంఘ భవనంలో జరుగుతుంది.

పింగళి భాగ్యలక్ష్మి

Updated Date - 2022-12-05T00:11:04+05:30 IST