వ్యవస్థల్ని తూట్లు పొడుస్తున్నారు!

ABN , First Publish Date - 2022-01-18T07:39:06+05:30 IST

రాజధాని ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో పోలీసులు, న్యాయాధికారుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్న...

వ్యవస్థల్ని తూట్లు పొడుస్తున్నారు!

రాజధాని ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో పోలీసులు, న్యాయాధికారుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్న వైనానికి అద్దం పడుతున్నాయి. రాజకీయ అధికార దుర్వినియోగంతో, ప్రలోభాలతో వ్యవస్థలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ క్రమంలో పేదలు, నిమ్న వర్గాలు న్యాయం లభించక నలిగిపోతున్నారు. చివరకు సామాజిక మాధ్యమాల్లో కూడా ఓ పథకం ప్రకారం వ్యవస్థలపై, వ్యక్తులపై అప్రతిహతంగా దాడులు చేయడం చూస్తున్నాం! ఈ పోకడలను ప్రజలు సమన్వయంతో, సహనంతో, సంఘటితంగా ఎదుర్కోవాలి. రాజకీయ దురహంకార విపరీత పోకడలకు అడ్డుకట్ట పడాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు బలహీనపడితే నష్టపోయేది పేదలే!

జి.రామకృష్ణ, ముస్తాబాద, కృష్ణా జిల్లా


Read more