‘తానా’ బాల సాహిత్యానికి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-21T00:10:20+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మంచి పుస్తకం (హైదరాబాద్‌) సంస్థతో కలిసి పదేళ్ల పిల్లల కోసం తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు-2023కి రచనలను ఆహ్వానిస్తోంది...

‘తానా’ బాల సాహిత్యానికి ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మంచి పుస్తకం (హైదరాబాద్‌) సంస్థతో కలిసి పదేళ్ల పిల్లల కోసం తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు-2023కి రచనలను ఆహ్వానిస్తోంది. ఎంపిక ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది. దశ-1: కథ సారాంశం, నమూనా బొమ్మలు మాకు 2023 జనవరి 15 లోపల అందచెయ్యాలి. దశ-2: పది కథాంశాలను ఎంపిక చేస్తాం. పుస్తకానికి కథ రాసినవారికి, బొమ్మలు వేసినవారికి రూ.15వేల చొప్పున పారితోషికం ఉంటుంది. 2023 మార్చి 31 లోపల బొమ్మలతో పూర్తి చేసి, ముద్రణకు సిద్ధంగా ఉన్న పుస్తకాన్ని అందజేయాలి. నీతి, జానపద, జంతువుల కథలు కాకుండా సమకాలీన వాతావరణం, అంశాలతో, ఒక్కొక్క పేజీలో 10-12 వాక్యాలకు మించకుండా, చదవటానికి సరదాగా హాయిగా ఉండాలి. రచనలు పంపాల్సిన చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీధి నెం.1, తార్నాక, సికింద్రాబాద్‌ - 500017. మరిన్ని వివరాలకు ఈమెయిల్‌: info@manchipustakam.in

కె. సురేష్‌ (మంచి పుస్తకం)

Updated Date - 2022-11-21T00:10:20+05:30 IST

Read more