తెలుగువారికి అవమానం

ABN , First Publish Date - 2022-10-01T07:25:16+05:30 IST

నందమూరి తారక రామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చడం దారుణం

తెలుగువారికి అవమానం

నందమూరి తారక రామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చడం దారుణం. ఈ చర్య ఒక మహానాయకుడిని అగౌరపరచడమే. తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహామనిషి ఎన్టీఆర్‌. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా నిలిపిన మహనీయుడు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తొమ్మిది నెలల్లోనే అధికారం అందుకోవడం సామాన్య విషయం కాదు. రాజకీయాల్లో అదొక సంచలనం. అంతటి మహనీయుడికి జరిగిన అవమానం తెలుగువారందరినీ ఆందోళన కలిగిస్తోంది. పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ నిమిత్తం లేకుండా తెలుగు ప్రజలు అందరూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేవరకూ పోరాడాలి.

– కాయల నాగేంద్ర

Read more