‘విశ్వకర్మ బీమా’ అమలుచేయాలి

ABN , First Publish Date - 2022-09-24T07:14:14+05:30 IST

ఇటీవల జగిత్యాలకు చెందిన స్వర్ణకార కుటుంబం అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి..

‘విశ్వకర్మ బీమా’ అమలుచేయాలి

ఇటీవల జగిత్యాలకు చెందిన స్వర్ణకార కుటుంబం అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి విశ్వబ్రాహ్మణ వృత్తులైన కమ్మరి, వడ్రంగి, కంచరి, శిలాశిల్పం, స్వర్ణకార సాంప్రదాయ వృత్తులలో జీవనం సాగిస్తున్న చేతివృత్తి కార్మికులకు ప్రభుత్వం ‘విశ్వకర్మ బీమా’ పథకాన్ని అమలు జరపాలి. మల్టీ బ్రాండెడ్ కంపెనీలు తమ జీవనోపాధిని కొల్లగొడుతూ విశ్వకర్మీయులను ఆర్థికంగా దయనీయస్థితిలోకి నెట్టివేశాయి. ప్రస్తుత కాలానికి కావలసినంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే స్తోమత లేని సాంప్రదాయ వృత్తులలో జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణ వృత్తి కార్మికులు జీవనోపాధి కరువై ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించి, వారి జీవన పరిస్థితి మెరుగయ్యేలా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే వృత్తి పని నిర్వహణలో అనారోగ్యం పాలై కార్మికులు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా ‘విశ్వకర్మ బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి.

– ఉల్లి వెంకటేశ్వర్లు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రచార కార్యదర్శి

Updated Date - 2022-09-24T07:14:14+05:30 IST