నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ

ABN , First Publish Date - 2022-12-05T00:50:52+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమవుతోంది...

నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ

స్వల్పంగానే ‘రెపో’ పెంపు!

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కీలక ‘రెపో’ వడ్డీ రేటు పెంపుపై ఎంపీసీ దూకుడుగా వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు. గత మూడు సమావేశాల్లో ఎంపీసీ రెపో రేటు వరుసగా అర శాతం చొప్పున పెంపునకు ఆమోదం తెలిపింది. అయితే సోమవారం నుంచి జరిగే భేటీలో ఈ పెంపు పావు శాతం నుంచి 0.35 శాతం మించి ఉండక పోవచ్చని భావిస్తున్నారు. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సెగ తగ్గడం ఇందుకు ప్రధాన కారణం కానుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీ వివరాలు బుధవారం విడుదలవుతాయి.

Updated Date - 2022-12-05T00:51:00+05:30 IST