ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన

ABN , First Publish Date - 2022-12-09T23:46:58+05:30 IST

పౌరులంతా వారి హక్కులు పొందడంతో పాటు విధులను బాధ్యతగా, నిజాయితీగా నిర్వహిస్తే అవినీతిరహిత భారతావని సాధ్యమవుతుందని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావ తి పేర్కొన్నారు.

ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన
న్యాయవాది శిరీషారెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న వైవీయూ వీసీ మునగాల సూర్యకళావతి

172 -

- వైవీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సూర్యకళావతి

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 9: పౌరులంతా వారి హక్కులు పొందడంతో పాటు విధులను బాధ్యతగా, నిజాయితీగా నిర్వహిస్తే అవినీతిరహిత భారతావని సాధ్యమవుతుందని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావ తి పేర్కొన్నారు. వైవీయూలో శుక్రవారం కౌన్సెలింగ్‌ అండ్‌ గైడెన్స సెల్‌తో కలిసి స్టూడెంట్‌ వెల్ఫేర్‌ సెల్‌, ఎనఎ్‌సఎ్‌స సెల్‌ మొదటి యూనిట్‌ ఆధ్వర్యంలో ‘మానవ హక్కుల పరిరక్షణ- అవినీతిరహిత సమాజం’ అనే అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అవినీతి అనేది ఒక బహుళ తలల రాక్షసత్వంగా అభివర్ణించారు. ఇది నిరక్షరాస్యత, అవగాహన లేని దురాశ కారణంగా రగులుతోందని ప్రజలంతా చైతన్యం కావాలన్నారు. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చడం మన అం దరి బాధ్యత అని తెలిపారు. రిజిసా్ట్రర్‌ ప్రొఫెసర్‌ విజయ రాఘవ ప్రసాద్‌ మాట్లాడుతూ అవినీతి అనేది మానవగౌరవ మర్యాదలు, అలాగే ప్రజల రాజకీయ సమానత్వంపై ప్రాథమిక విలువలపై దాడి చేస్తుందని, ఇది ప్రమాదకరమని తెలిపారు. ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చన్నారు. న్యాయవాది శిరీషారెడ్డి మాట్లాడుతూ మానవ హక్కులు మనిషికి జన్మతః సంక్రమించేవని, వాటిని పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వి.లాజర్‌, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్‌ పద్మ, మైనార్టీ సెల్‌ సమన్వయకర్త రియాజున్నీసా, మధుసూదనరెడ్డి, అధ్యాపకులు రవీంద్ర, లక్ష్మినరసింహ, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:47:03+05:30 IST