విద్యుత్ కోతలతో విలవిల!

ABN , First Publish Date - 2022-02-23T05:56:08+05:30 IST

రాష్ట్రంలో శీతాకాలంలోనే విద్యుత్ కోతలు మొదలవటం, అదీ జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు గంటల తరబడి కోతలు విధించడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది...

విద్యుత్ కోతలతో విలవిల!

రాష్ట్రంలో శీతాకాలంలోనే విద్యుత్ కోతలు మొదలవటం, అదీ జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు గంటల తరబడి కోతలు విధించడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యుత్ చార్జీలు గణనీయంగా పెంచి, ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఉత్పత్తిదారులు సరఫరా నిలిపివేసినట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇవే కనుక నిజమయితే ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? మరో వైపు ఉన్న పరిశ్రమలే రకరకాల కారణాలతో మూతపడుతున్నాయి. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయాలు లేకుండా సరఫరా చెయ్యాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

గరిమెళ్ళ రామకృష్ణ

Read more