ఓసారి మాట్లాడితే సరిపోయేది!

ABN , First Publish Date - 2022-01-22T06:01:29+05:30 IST

చింతామణి నాటక నిషేధంతో సాధించిందేమిటి? శీర్షికన మాడభూషి శ్రీధర్ రాసిన వ్యాసం (జనవరి 20) బాగుంది. చింతామణిని కాళ్ళకూరు నారాయణరావు గారు తీర్చిదిద్దిన ఆనాటి పరిస్థితుల గురించి నాటకాన్ని...

ఓసారి మాట్లాడితే సరిపోయేది!

చింతామణి నాటక నిషేధంతో సాధించిందేమిటి? శీర్షికన మాడభూషి శ్రీధర్ రాసిన వ్యాసం (జనవరి 20) బాగుంది. చింతామణిని కాళ్ళకూరు నారాయణరావు గారు తీర్చిదిద్దిన ఆనాటి పరిస్థితుల గురించి నాటకాన్ని నిషేధించిన నేటివారికి అవగాహన లేకపోవడం ఒక ఎత్తైతే, సుబ్బిశెట్టి గారు నాటక ప్రదర్శనల్లో మాట్లాడిన మాటలు అసలు నారాయణరావుగారు రాసారా? అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అందువల్ల ముందుగా ఈ ‘సమస్య’ను ఒకసారి శ్రీమతి లక్ష్మీపార్వతిగారు కాళ్ళకూరి నారాయణరావు ‘ఆత్మ’తో మాట్లాడి, ఆ తరువాత ‘చింతామణి’ని నిషేధించి ఉంటే బాగుండేది. ఎవరో కొందరు మేధావులు తప్ప అందరూ అనుకొంటున్నదేమంటే, ఆంధ్రప్రదేశ్ అర్యవైశ్య సమాజం ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల పాలకపక్షానికి దూరమైపోయిందనే (?) భయంతో, ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలో భాగంగా మళ్ళీ వారిని దగ్గరకు చేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో చింతామణిని తెలుగువారికి దూరం చేయడానికి ఈ నిషేధాన్ని తెచ్చారట. ఇది వారు ఆశించిన ఫలితాలు సాధిస్తుందో లేదో తెలియదుకానీ, నాటక ప్రదర్శనల మీద ఆధారపడి జీవిస్తున్న కొద్దిపాటి కళాకారులకు పెద్ద దెబ్బే. 

శ్రీపాద సత్యనారాయణ

Updated Date - 2022-01-22T06:01:29+05:30 IST