న్యూ‘క్లియర్’

ABN , First Publish Date - 2022-07-23T06:21:23+05:30 IST

నేడు నిశాంతములు తమ‍ఃక్రాంతమాయె..

న్యూ‘క్లియర్’

నేడు నిశాంతములు తమ‍ఃక్రాంతమాయె

నినాదములు గుసగుసలుగ మారె

ఆర్తనాదములు పెగలక మూల్గె

మనసుమాట మౌనమైపోయె

అణువణువూ అణకువాయె నేడు...

అయితేనేం ప్రాణముందిగా

చావనంటోంది స్పృహ

చాలదా పరమాణువు

చణ్డ‍ఃప్రకోప కోప విస్ఫోటనానికంటూ.


– వల్లూరి వెంకట రామారావు

Read more