ఆయన మరణాన్ని జయించాడు

ABN , First Publish Date - 2022-05-28T06:07:30+05:30 IST

ఆయన భూగోళాన్ని బంతిలా డగలడుభూమ్యాకాశాలను ఏకం చేయగలడు..

ఆయన మరణాన్ని జయించాడు

ఆయన భూగోళాన్ని బంతిలా ఆడగలడు

భూమ్యాకాశాలను ఏకం చేయగలడు

రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించినవాడు

దశాబ్దాల రాజకీయ విషవృక్షాల్ని పెకలించిన ధీరుడు

ఢిల్లీ పాలకుల వికృత రాజకీయ బొమ్మలాటకు

ఒంటిచేత్తో తెరదించిన చండశాసనుడు

తానే సుదర్శన చక్రంగా మారి నియంతృత్వాన్ని

తుదముట్టించిన మూడక్షరాల మురారి

ఆయన ఆత్మాభిమానానికి ఆనవాలు

ఆత్మవిశ్వాసానికి ఆయనే చేవ్రాలు

నీతి నిజాయితీలకు నిలువుటద్దం

కుటిల నీతి ప్రక్షాళనకు అక్షరబద్ధం

ఆయన వామహస్తం ప్రజా సునామీ కేంద్రం

ఆయన చూపుడు వేలే వెల్లువెత్తిన అభిమానసంద్రం

పేదింటి గడపకు పదవులు పంచిన ఆత్మీయనేస్తం

సామాన్యులకు అందలం అందించిన అభయహస్తం

తెలుగు భాషకు వెలుగు తెచ్చిన నెలరేడు

తెలుగు ఖ్యాతి ఖండాలు చేర్చిన నావికుడు

ఆయన అన్నార్తుల నోటికందిన అన్నంగిన్నె

‘అన్న’ అనే అనుబంధానికి బంగారువన్నె

ఆయన ప్రతి తెలుగువాని గుండెచప్పుడు

తెలుగు చిత్రరంగానికే తిరుగులేని నాయకుడు

ఆయనే ఎన్‌టిఆర్‌ – చరిత్రను మలిచిన సూపర్‌ పవర్‌

ఆయన మరణాన్ని జయించాడు – ఆయన మృత్యుంజయుడు


– కెహెచ్‌కె మోహన్‌రావు

Read more