అన్నదాతకు అన్యాయం తగదు

ABN , First Publish Date - 2022-03-17T08:42:39+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు తమ ఇష్టారీతిన నష్టపరిహారం ఇస్తామనటం సరికాదు. ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసి...

అన్నదాతకు అన్యాయం తగదు

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు తమ ఇష్టారీతిన నష్టపరిహారం ఇస్తామనటం సరికాదు. ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ అనంతరమే నష్టపరిహారం ప్రకటించితే అన్నదాతలకు రక్షణ కల్పించినట్లవుతుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణానికి సేకరించిన భూమికి ఎకరా కోటి రూపాయలు చెల్లించిన ప్రభుత్వం (ఏ చట్ట ప్రకారం చెల్లించారో వివరించలేదు) జాతీయ రహదారులకు సేకరించిన భూమికి ఎకరా 10 నుండి 25 లక్షల ధనం చెల్లిస్తామనటం ధర్మంకాదు. అన్నదాతలను బిచ్చగాళ్ళుగా చూడటం సభ్యతకాదు. సంక్షేమ రాజ్యంలో రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. జాతీయ రహదారుల ప్లానింగ్‌ సందర్భంగా, ఇప్పటికే కొనసాగుతున్న రహదారులు, గ్రామాలు, పట్టణాలను వదిలి బైపాస్‌ మార్గాలను, నిష్పక్షపాతంగా వేసే ప్రయత్నం చేసినట్లైతే, గృహస్తులకు అన్యాయం జరక్కుండా ఉంటుంది. జాతీయ రహదారులకు ఇరువైపులా చింత, వేప, విప్ప, తాటి, ఖర్జూర చెట్లను నాటించినట్లయితే మంచి ఆదాయమూ లభిస్తుంది.

డా. రావెళ్ళ వెంకటరామారావు

Updated Date - 2022-03-17T08:42:39+05:30 IST