ఉద్యోగులంటే చులకన భావం తగదు!

ABN , First Publish Date - 2022-11-30T00:28:06+05:30 IST

అవసరమైతే కాళ్లు పట్టుకునే నైపుణ్యం ఉండాలని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులకు సూచించడం వారి...

ఉద్యోగులంటే చులకన భావం తగదు!

అవసరమైతే కాళ్లు పట్టుకునే నైపుణ్యం ఉండాలని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులకు సూచించడం వారి అధికార దురహంకారానికి అద్దం పడుతున్నది. ఉద్యోగుల్లో మంత్రి కంటే ఉన్నత విద్యావంతులు ఉంటారు, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం మంత్రులకు తగదు. మంత్రులు ప్రభుత్వోద్యోగులకు వేతనాలు వారి సొంత డబ్బులు ఇవ్వడం లేదు. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి ఇస్తున్నారు! ఆ ఇచ్చే వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. డిఎ బకాయిలు పేరుకుపోతున్నాయి. బాధ్యతారాహిత్య పాలనతో పాలకులు ఉద్యోగులకు నీతులు చెప్పే నైతిక హక్కు కోల్పోయారు.

జి.రామకృష్ణ

Updated Date - 2022-11-30T00:28:06+05:30 IST

Read more