క్యూఆర్‌ కోడ్‌ పంపి రూ.97 వేలు ఖాళీ

ABN , First Publish Date - 2022-11-03T00:59:28+05:30 IST

నేరేడ్‌మెట్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే మహిళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమైన ఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌లోని వివేకానందపురంలో ఉంటున్న భువనేశ్వరీదేవి (48) టీవీ టేబుల్‌ను రూ. 5,500లకు ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టింది. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి గత నెల 27న ఆమెకు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. టీవీ టేబుల్‌ను మీరు చెప్పిన రేటుకు కొంటానని ఆ వ్యక్తి ఆమెకు చెప్పాడు. పేమెంట్‌ చేయడానికి క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ను పంపుతున్నానని, దానిని స్కాన్‌ చేయాలని ఆ వ్యక్తి ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె అతను పంపిన క్యూఆర్‌ కోడ్‌ను ఆమె ఆరు సార్లు స్కాన్‌ చేసింది. వెంటనే ఆమె ఐఓబీ బ్యాంకు ఖాతా నుంచి రూ.97 వేలు మాయమయ్యాయి. మోసపోయానని గ్రహించిన ఆమె బుధవారం నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహస్వామి తెలిపారు.

Updated Date - 2022-11-03T00:59:29+05:30 IST