బై ఆన్‌ డిప్స్‌ వ్యూహం బెటర్‌!

ABN , First Publish Date - 2022-12-05T00:49:04+05:30 IST

ఈ వారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలు స్టాక్‌ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే వీలుంది. టెక్నికల్‌గా చూస్తే మాత్రం మార్కెట్లో...

బై ఆన్‌ డిప్స్‌ వ్యూహం బెటర్‌!

ఈ వారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలు స్టాక్‌ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే వీలుంది. టెక్నికల్‌గా చూస్తే మాత్రం మార్కెట్లో అప్‌ట్రెండ్‌కే ఎక్కువగా అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారం నిఫ్టీకి కొద్దిగా నిరోధం ఎదురైనా కీలకమైన 18,900 పాయింట్ల దిశగా సాగే వీలుంది. అంతేకాకుండా నిఫ్టీకి 18,500 పాయింట్ల వద్ద బలమైన మద్దతు స్థాయిలున్నాయి. సమీప భవిష్యత్తులో మానసిక అవధి స్థాయిలైన 19,000 మార్కును తాకే అవకాశం ఉంది.

ట్రేడర్లు మాత్రం దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ పడితే కొను (డిప్‌ ఆన్‌ బై) వ్యూహాన్ని అమలు చేయటం మంచిది. లాంగ్‌ పొజిషన్లను తీసుకోవటం కూడా బెటర్‌. మిడ్‌ క్యాప్‌ విభాగం బ్రేకౌట్‌ సాధించటంతో రానున్న రోజుల్లో ర్యాలీని కనబరిచే అవకాశాలున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

మిండాకార్ప్‌: డైలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరు ‘ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌’ ప్యాట్రన్‌తో బ్రేకౌట్‌ సాధించింది. టెక్నికల్‌గా చూస్తే సమీప భవిష్యత్తులో షేరు ధర మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయు. గత శుక్రవారం రూ.220.50 వద్ద క్లోజైన ఈ షేరును రూ.242 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.209.80 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

జ్యోతిలాబ్‌: ఈ కౌంటర్‌లో అమ్మకాలు గణనీయంగా పెరగటంతో షేరు ధర 52 వారాల గరిష్ఠ స్థాయిని అధిగమించింది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే అన్ని అంశాలు అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయి. గత శుక్రవారం రూ.210.40 వద్ద క్లోజైన షేరును రూ.230 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.200 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఓషో కృష్ణన్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌, టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2022-12-05T00:49:04+05:30 IST

Read more