నిరాధార ఆరోపణలతో సభాసంఘాలా?

ABN , First Publish Date - 2022-03-23T05:57:37+05:30 IST

ఒక నిరాధార వార్తాకథనంపై ఆధారపడి గత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నదంటూ అధికార పార్టీ సభ్యులు రాష్ట్ర శాసనసభలో సభా సంఘాన్ని వేసి విచారణ జరపాలని కోరడం...

నిరాధార ఆరోపణలతో సభాసంఘాలా?

ఒక నిరాధార వార్తాకథనంపై ఆధారపడి గత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నదంటూ అధికార పార్టీ సభ్యులు రాష్ట్ర శాసనసభలో సభా సంఘాన్ని వేసి విచారణ జరపాలని కోరడం, అందుకు స్పీకర్ ఆమోదించడం విడ్డూరం! ఇదే అంశంపై గతంలో రాష్ట్ర డీజీపీ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారానికి ఎటువంటి కొనుగోలు జరగలేదని నిర్ధారణ అయ్యింది. అయినా సభాసంఘం వేసి విచారించాలనడం సరికాదు. గత మూడేళ్లుగా గత ప్రభుత్వంపై ఇలాంటి నిరాధార ఆరోపణలతో కేసులు పెట్టడం, ఆపై న్యాయస్థానాల్లో చివాట్లు తినడం పాలకులకు పరిపాటి అయింది. చివరకు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చారు. నవ్వి పోదురుగాక నాకేటి అన్నట్లు ఉంది పాలకుల తీరు

కంభంపాటి కోటేశ్వరరావు

Read more