ఇంట్లో బంగారం, డబ్బు మాయం.. అనుమానం వచ్చి కూతురిని అడిగితే కన్నీళ్లతో ఆ బాలిక చెప్పింది విని షాక్!

ABN , First Publish Date - 2022-11-15T15:34:49+05:30 IST

ఆ ఇంట్లో నాలుగు తులాల బంగారం, రూ.48 వేలు కనిపించకుండా పోయాయి.. వాటి కోసం ఇల్లంతా వెతికిన దంపతులు తమ కూతురిని అడిగారు.. కన్నీళ్లతో ఆ బాలిక చెప్పింది విని నివ్వెరపోయారు..

ఇంట్లో బంగారం, డబ్బు మాయం.. అనుమానం వచ్చి కూతురిని అడిగితే కన్నీళ్లతో ఆ బాలిక చెప్పింది విని షాక్!

ఆ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురిని చదివిస్తున్నారు.. ఆ బాలిక సక్రమంగా చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది.. ఇటీవల ఆ ఇంట్లో నాలుగు తులాల బంగారం, రూ.48 వేలు కనిపించకుండా పోయాయి.. వాటి కోసం ఇల్లంతా వెతికిన దంపతులు తమ కూతురిని అడిగారు.. కన్నీళ్లతో ఆ బాలిక చెప్పింది విని నివ్వెరపోయారు.. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పొరుగింటి యువకుడిపై ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై ఆమె పొరుగింటి యువకుడు కన్నేశాడు. ఆరు నెలల క్రితం ఆ బాలికను తన ఇంటికి ఆహ్వానించి మత్తు మందు కలిపిన చాక్లెట్లు తినిపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి ఆ బాలికను బెదిరించడం ప్రారంభించాడు. గత ఆరు నెలలుగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాదు తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. భయపడిన బాలిక తన ఇంట్లో ఉన్న తల్లి నగలు, రూ.48 వేలు అతడికి ఇచ్చేసింది.

ఇంట్లో డబ్బు, బంగారం మాయం కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని వారు కూతురిని నిలదీశారు. దీంతో ఆ బాలిక పొరుగింటి యువకుడు చేస్తున్న అత్యాచారం గురించి, బ్లాక్‌మెయిల్ గురించి చెప్పేసింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని నిలదీశారు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని అడిగారు. రూ.10 వేలు ఇస్తేనే ఆ వీడియోను డిలీట్ చేస్తానని యువకుడు తెగేసి చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ యువకుడిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-11-15T15:34:49+05:30 IST

Read more