భర్త శవంతో మూడు రోజులు..!

ABN , First Publish Date - 2022-05-25T16:02:04+05:30 IST

స్థానిక పురుషవాక్కం ప్రాంతంలో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ భర్త శవంతో ఒకే గదిలో మూడు రోజుల పాటు గడిపింది. వివరాలిలా ...సైకిల్‌కారన్‌ వీధికి చెందిన అశోక్‌బాబు

భర్త శవంతో మూడు రోజులు..!

చెన్నై: స్థానిక పురుషవాక్కం ప్రాంతంలో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ భర్త శవంతో ఒకే గదిలో మూడు రోజుల పాటు గడిపింది. వివరాలిలా ...సైకిల్‌కారన్‌ వీధికి చెందిన అశోక్‌బాబు (53), పద్మిని (48) దంపతుల కుమారుడు అరవింద్‌ బెంగుళూరులో, వారి కుమార్తె ఆరతి ముంబాయిలో నివశిస్తున్నారు. కాగా పద్మిని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం తో చికిత్స పొందుతోంది. అశోక్‌బాబు వేలూరు జిల్లా ఆంబూరులో తోళ్ల కర్మాగారంలో పని చేస్తున్నాడు.ఈనేపథ్యంలో నాలుగురోజుల క్రితం ఆరతి తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడింది. ఆ తరువాత అతని కోసం ఎంత ప్రయత్నించినా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. అనుమానించిన ఆరతి సోమవారం సాయంత్రం పుట్టింటికి చేరుకుంది. అయితే ఇంటి లోపల గడియ పెట్టి ఉండి, అలికిడి వినిపించడంతో అనుమానంతో ఆరతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. లోపల అశోక్‌బాబు నగ్నంగా శవంగా పడుఉండగా, పక్కనే కూర్చున్న పద్మిని శూన్యంలోకి చూస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా, అతను మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు వెల్లడైంది. మానసిక స్థితి సరిగ్గా లేని పద్మిని.. భర్త మరణంతో ఏం చేయాలో తోచక లోపలే వుండిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more