ముగ్గురు బాలికల ప్రాణాలను బలిగొన్న భారీ అల

ABN , First Publish Date - 2022-07-10T14:10:15+05:30 IST

వేలాంకన్నికి విహారయాత్రకు వచ్చిన ముగ్గురు బాలికలు నీటమునిగి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాగపట్టణం జిల్లాలో ప్రసిద్ధిచెందిన

ముగ్గురు బాలికల ప్రాణాలను బలిగొన్న భారీ అల

పెరంబూర్‌(చెన్నై), జూలై 9: వేలాంకన్నికి విహారయాత్రకు వచ్చిన ముగ్గురు  బాలికలు నీటమునిగి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాగపట్టణం జిల్లాలో ప్రసిద్ధిచెందిన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం వేలాంకన్నికి నిత్యం పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో, శివగంగ జిల్లా మానామదురైకి రాజకంబీరం గ్రామం నుంచి 15 మంది శనివారం ఉదయం వేలాంకన్నికి వచ్చారు. వేలాంకన్ని మాత ఆలయానికి సొంతమైన విడిది గృహంలో బసచేసిన వారు సమీపంలో సముద్రంలో స్నానాలకు వెళ్లారు. వారిలో ఆరోగ్య శ్రీన్‌ (19), రియానా (13), సహనా (14) స్నానం చేస్తుండగా ఊహించని విధంగా భారీ అలలో చిక్కుకున్నారు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ముగ్గురిని ఒడ్డుకు చేర్చి అంబులెన్స్‌లో నాగపట్టణం వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more