కూతురి పెళ్లి జరిగిన రెండో రోజే షాకింగ్ ఘటన.. రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసే సరికి..

ABN , First Publish Date - 2022-11-07T16:14:42+05:30 IST

అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించాడు.. తన కూతురితో పాటు బంగారు నగలను,డబ్బులను అల్లుడి ఇంటికి పంపించాలని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు.. అయితే..

కూతురి పెళ్లి జరిగిన రెండో రోజే షాకింగ్ ఘటన.. రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసే సరికి..

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన తన కూతురి పెళ్లి ఘనంగా జరిపించాడు.. తన కూతురితో పాటు బంగారు నగలను, కట్నం డబ్బులను అల్లుడి ఇంటికి పంపించాలని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు.. అయితే అతడి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకున్నారు.. రూ.30 లక్షలు విలువైన బంగారు నగలు, రూ.6 లక్షల నగదు దోచుకుని పారిపోయారు. ఇంట్లో అంత మంది ఉన్నా ఉదయం లేచే వరకు ఎవరికీ విషయం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

అజ్మీర్‌లోని పనేర్‌లో నివాసం ఉంటున్న బాబులాల్ తన కుమార్తె వివాహాన్ని ఈ నెల 4వ తేదీన ఘనంగా జరిపించాడు. నవంబర్ 5వ తేదీ రాత్రి బంగారు నగలు, డబ్బు ఉంచిన గదికి తాళం వేసి నిద్రకు ఉపక్రమించారు. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. ఉదయం నిద్ర లేచి చూడగా గది తలుపులు తీసి ఉన్నాయి. లోపల ఉన్న అల్మారాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో ఉంచిన 41 తులాల బంగారం, మూడు కేజీల వెండి, రూ.6 లక్షల నగదు అదృశ్యమయ్యాయి. షాకైన బాబులాల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బాబూలాల్ ఇంటికి కిలోమీటర్ దూరంలో నగలు ఉంచిన పెట్టి ఖాళీగా పడి ఉంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరో దగ్గరి వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ రోజు ఇంట్లో ఉన్న బంధువులందరినీ విచారిస్తున్నారు.

Updated Date - 2022-11-07T16:14:42+05:30 IST

Read more