college Girl: కళాశాల హాస్టల్ టాయ్లెట్లో బాలిక ఏం చేసిందంటే...
ABN , First Publish Date - 2022-09-21T18:09:33+05:30 IST
ఓ కళాశాల హాస్టల్ టాయ్లెట్లో ఓ బాలిక ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన తమిళనాడు(TamilNadu) రాష్ట్రంలో సంచలనం రేపింది...
చెన్నై(తమిళనాడు): ఓ కళాశాల హాస్టల్ టాయ్లెట్లో ఓ బాలిక ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన తమిళనాడు(TamilNadu) రాష్ట్రంలో సంచలనం రేపింది. తూత్తుకుడి పట్టణంలోని ఓ వసతిగృహంలో 12 వతరగతి చదువుతున్న 16 ఏళ్ల వయసున్న వైతేశ్వరీ అనే బాలిక (college Girl)టాయ్లెట్లో(Hostel Toilet) మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.బాలిక వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని ఎస్పీ బాలాజీ శ్రీనివాసన్ చెప్పారు. బాలిక సూసైడ్ నోట్ ను పోలీసులు హాస్టల్ గదిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు.
వైతేశ్వరీ ఆత్మహత్యకు కారణాలను తాము బయటపెట్టలేమని ఎస్పీ చెప్పారు. మృతురాలు వైతేశ్వరీ రామనాథపురం జిల్లా వాసి అని పోలీసులు చెప్పారు.హాస్టళ్లలో నలుగురు బాలికలు, ఓ బాలుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. నీట్ లాంటి పరీక్షల కోసం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని, అలా కాకుండా ఉపాధ్యాయులు చూడాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవల కోరారు.