బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన సుప్రీం

ABN , First Publish Date - 2022-06-24T20:43:21+05:30 IST

దీనితో పాటు మరిన్ని కేసులు కూడా అతడిపై ఉన్నాయి. గతంలో అతడు వివిధ కేసులతో నాలుగేళ్లు జైల్లో ఉన్నాడు. ఇక ఈ హత్యాచారం కేసులో దొంగిలించిన మోటర్ సైకిల్‌ను వినియోగించినట్లు రుజువైంది. ఇవే కాకుండా జైలులో ఉన్న సమయంలో సహ ఖైదీలతో తీవ్ర స్థాయిలో గొడవలు పడ్డట్లు..

బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన సుప్రీం

న్యూఢిల్లీ: మానసికంగా భౌతికంగా వికలాంగురాలైన ఒక ఏడున్నరేళ్ల బాలిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి రాజస్తాన్ హైకోర్టు 2015 మే 29న విధించిన మరణశిక్షను జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, సీ.టీ.రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధిస్తూ తాజా తీర్పు వెలువరించింది. నేరం జరిగిన విధానం, నేరస్తుడి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని అతడికి యావజ్జీవ కారాగార శిక్ష వేయడం కూడా తక్కువేనని అందుకే మరణశిక్ష విధిస్తున్నట్లు కోరటు పేర్కొంది.


రాజస్తాన్‌కు చెందిన మనోజ్ ప్రతాప్ అనే వ్యక్తి 2013 జనవరి 17న ఒక మానసిక, భౌతిక వికలాంగురాలైనా ఏడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై దారుణమైన రీతిలో అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి రాజస్తాన్ హైకోర్టు ఏడేళ్ల క్రితమే మరణశిక్ష విధించగా, అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇక్కడ కూడా నిందితుడిపై అన్ని నేరాలు రుజువు చేయబడడంతో భారత శిక్షస్మృతి 1860లోని సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం తెలిపింది.


దీనితో పాటు మరిన్ని కేసులు కూడా అతడిపై ఉన్నాయి. గతంలో అతడు వివిధ కేసులతో నాలుగేళ్లు జైల్లో ఉన్నాడు. ఇక ఈ హత్యాచారం కేసులో దొంగిలించిన మోటర్ సైకిల్‌ను వినియోగించినట్లు రుజువైంది. ఇవే కాకుండా జైలులో ఉన్న సమయంలో సహ ఖైదీలతో తీవ్ర స్థాయిలో గొడవలు పడ్డట్లు జైలు రికార్డులు పేర్కొన్నాయి. ఈ కేసులను సైతం పరిగణలోకి తీసుకుని శిక్ష ఖరారు చేసినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Read more