రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-04-05T13:08:30+05:30 IST

పెరంబలూరు సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. కళ్లకురిచ్చికి చెందిన కార్ముగిల్‌ తొమ్మిదిమంది బంధువులతో కలసి కారులో

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

పెరంబూర్‌(చెన్నై): పెరంబలూరు సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. కళ్లకురిచ్చికి చెందిన కార్ముగిల్‌ తొమ్మిదిమంది బంధువులతో కలసి కారులో మదురై జిల్లా సమయపురం మారియమ్మన్‌ ఆలయానికి వెళ్లాడు. దర్శనానంతరం స్వస్థలానికి బయలు దేరారు. పెరంబలూరు జిల్లా కారై జంక్షన్‌ వద్ద ఓ హోటల్లోకి వెళ్లేందుకు కారు తిప్పుతుండగా, పక్క నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కార్ముగిల్‌ (45), ఆయన కుమారుడు లింగేద్రన్‌ (8), బంధువులు కన్నన్‌ (45), తమిళరసి (65) అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రదన్‌, కిషోర్‌, వేదవల్లి, కదిరవన్‌ తీవ్రం గా గాయపడ్డారు. స్థానికులు వారిని పెరంబలూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more