Viral Video: ప్రేమను తిరస్కరించిందని పెట్రోలు పోసి అమ్మాయిని తగలబెట్టిన యువకుడు.. ఎలా నవ్వుతున్నాడో చూడండి!

ABN , First Publish Date - 2022-08-29T21:42:04+05:30 IST

తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడో ఉన్మాది. ప్రస్తుతం పోలీసు

Viral Video: ప్రేమను తిరస్కరించిందని పెట్రోలు పోసి అమ్మాయిని తగలబెట్టిన యువకుడు.. ఎలా నవ్వుతున్నాడో చూడండి!

దుమ్కా: తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడో ఉన్మాది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఝార్ఖండ్‌లోని దుమ్కా (Dumka) జిల్లాలో జరిగిందీ ఘటన.


పోలీసుల కథనం ప్రకారం.. దుమ్కాకు చెందిన 19 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన షారూక్ (Shahrukh) అనే యువకుడు  ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడ్డాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. 


విషయం వెలుగులోకి రావడంతో దుమ్కాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు దుమ్కాలో 144 సెక్షన్ విధించారు.  


నిందితుడు షారూక్, అతడికి పెట్రోలు సరఫరా చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బేడీలు వేసి వ్యాన్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో షారూక్ చిరునవ్వులు చిందించాడు. వీడియో వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సిగ్గులేకుండా నవ్వుతున్నాడంటూ’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  




Read more