Wife: తల్లి అంత్యక్రియలకు భార్య చెవిపోగులు ఇవ్వలేదని...భర్త దారుణం

ABN , First Publish Date - 2022-11-21T08:31:03+05:30 IST

తన తల్లి అంత్యక్రియల కోసం చెవిపోగులు ఇచ్చేందుకు నిరాకరించిన భార్యను హత్య చేసి పారిపోయిన భర్త ఉదంతం....

Wife: తల్లి అంత్యక్రియలకు భార్య చెవిపోగులు ఇవ్వలేదని...భర్త దారుణం
Deadbody

పాల్ఘార్ (మహారాష్ట్ర): తన తల్లి అంత్యక్రియల కోసం చెవిపోగులు ఇచ్చేందుకు నిరాకరించిన భార్యను హత్య చేసి పారిపోయిన భర్త ఉదంతం మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో జరిగింది. పాల్ఘార్ జిల్లాలోని పెల్హార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తల్లి మరణించింది. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు(Rituals) డబ్బు కోసం భార్య(Wife) చెవిపోగులు ఇవ్వాలని భర్త(Husband) కోరాడు. చెవిపోగులు(Earrings) ఇచ్చేందుకు భార్య నిరాకరించడంతో కోపగించుకున్న భర్త ఆమెను గొంతు కోసి చంపి పారిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దంపతుల 14 ఏళ్ల కుమారుడు ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-11-21T08:31:04+05:30 IST