సీఐ నాగేశ్వరరావు లొంగిపోలేదు: Mahesh Bhagwat

ABN , First Publish Date - 2022-07-10T21:29:58+05:30 IST

మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు (Inspector Nageswara Rao) (45) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని

సీఐ నాగేశ్వరరావు లొంగిపోలేదు: Mahesh Bhagwat

హైదరాబాద్‌: మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు (Inspector Nageswara Rao) (45) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురంనకు చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్‌ (Kidnap), హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నాగేశ్వరరావు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ (CP Mahesh Bhagwat) ఖండించారు. నాగేశ్వరరావును లొంగిపోలేదని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. నాగేశ్వరరావు లొంగిపోయినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని భగవత్ ప్రకటించారు.

Read more