నిత్యం తాగి దూషిస్తున్నాడని....

ABN , First Publish Date - 2022-09-28T13:55:49+05:30 IST

నిత్యం మద్యం సేవించి, తనను చిత్రహింసలు పెడుతున్న భర్తపై ఆగ్రహించిన భార్య.. క్షణికావేశంలో గడ్డపారతో తిరగబడింది. ఈ దాడిలో భర్త

నిత్యం తాగి దూషిస్తున్నాడని....

                               - భర్తను హత్య చేసిన మహిళ అరెస్టు


వేలూరు(చెన్నై), సెప్టెంబరు 27: నిత్యం మద్యం సేవించి, తనను చిత్రహింసలు పెడుతున్న భర్తపై ఆగ్రహించిన భార్య.. క్షణికావేశంలో గడ్డపారతో తిరగబడింది. ఈ దాడిలో భర్త చనిపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాణీపేట జిల్లా ఉరియూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలిలా... ఉరియూన్‌కు చెందిన సీరాలన్‌ (38) సౌండ్‌ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య శోభన (30). ఆ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా మద్యానికి బానిసైన సీరాలన్‌.. ప్రతిరోజూ భార్యతో గొడవ పడడంతో పాటు ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున కూడా దంపతుల మధ్య వివాదం నెలకొనగా.. శోభన చేతికందిన గడ్డపారతో కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. స్థానికులందించిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శోభనను అరెస్టు చేశారు.

Read more