పెళ్లిలో వరుడు celebratory firing: స్నేహితుడు మృతి

ABN , First Publish Date - 2022-06-23T22:40:57+05:30 IST

సోన్‌భద్రకు చెందిన మనీష్ మధేషియా తాజాగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరుగుతుండగానే అతిధుల మధ్య తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఇంతలో ఒక బుల్లెట్ మిస్‌ఫైర్ అయి అతడి స్నేహితుడు, ఆర్మీ జవాను బాబు లాల్..

పెళ్లిలో వరుడు celebratory firing: స్నేహితుడు మృతి

లఖ్‌నవూ: దాదాపుగా అన్ని పెళ్లి మండపాల వద్ద టాపాసుల మోత ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల తుపాకుల మోతలు వినిపిస్తుంటాయి. వరుడో, వధువో పెళ్లి మండపం నుంచే గన్ షాట్స్ కొడుతున్న వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే వచ్చాయి. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని తెలిసినా, పోలీసు యంత్రాంగం నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆగడం లేదు. తాజాగా యూపీలోని సోన్‌భద్రలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే ఇది కాల్పులతోనే ఆగకుండా మిత్రుడి ప్రాణం పోయే వరకు వెళ్లింది.


సోన్‌భద్రకు చెందిన మనీష్ మధేషియా తాజాగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరుగుతుండగానే అతిధుల మధ్య తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఇంతలో ఒక బుల్లెట్ మిస్‌ఫైర్ అయి అతడి స్నేహితుడు, ఆర్మీ జవాను బాబు లాల్ యాదవ్‌కు తగిలింది. అంతే బాబు లాల్ అక్కడికక్కడే మరణించాడు. పైగా మనీష్ కాల్చిన తుపాకీ చనిపోయిన ఆర్మీ జవాను బాబు లాల్‌దే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై సోన్‌భద్ర ఎస్పీ అమరేంద్ర ప్రతాప్ సింగ్ స్పందిస్తూ నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.Read more