French Woman: గైడ్ ఇచ్చిన డ్రింక్ తాగిన ఫ్రెంచ్ పర్యాటకురాలు.. తెల్లారి తెలివి వచ్చాక చూస్తే నగ్నంగా..

ABN , First Publish Date - 2022-09-27T21:49:27+05:30 IST

దేశంలోని పవిత్ర పర్యాటక ప్రదేశమైన వారణాసిని సందర్శించేందుకు వచ్చిన ఫ్రెంచ్ పర్యాటకురాలు (French Woman)

French Woman: గైడ్ ఇచ్చిన డ్రింక్ తాగిన ఫ్రెంచ్ పర్యాటకురాలు.. తెల్లారి తెలివి వచ్చాక చూస్తే నగ్నంగా..

వారణాసి: దేశంలోని పవిత్ర పర్యాటక ప్రదేశమైన వారణాసిని సందర్శించేందుకు వచ్చిన ఫ్రెంచ్ పర్యాటకురాలు (French Woman) ఒకరు స్థానిక గైడ్ చేతిలో అత్యాచారానికి గురైంది. వారణాసి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించిన గైడ్ చివరి రోజున ఆమెకు మత్తమందు కలిపి ఇచ్చిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. భేలుపూర్ పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రెంచ్ (French) నుంచి యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన వారణాసి వచ్చిన ప్రయాణికురాలు ఓ గెస్ట్ హౌస్ తీసుకుంది. 


వారణాసిలో సైట్ సీయింగ్ కోసం స్థానిక గైడ్‌ను ఆశ్రయించింది. అన్ని ప్రదేశాలను ఆమెకు తిప్పి చూపించిన గైడ్.. చివరి రోజున ఆమెను (French Woman) రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడామెకు బీర్ ఆర్డర్ చేశాడు. అందులో స్థానిక ఆల్కహాల్ కలిపి ఇచ్చాడు. అది తాగిన తర్వాత తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, తర్వాతి రోజు ఉదయం నిద్రలేచినప్పుడు తన శరీరంపై దుస్తులు లేవని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు (French Woman) పేర్కొంది. అంతేకాదు, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, నొప్పులతో బాధపడినట్టు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా, నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. 


ఈ ఏడాది ఆగస్టులోనూ ఇలాంటి ఘటనే ఒకటే జరిగింది. ఓ మహిళ స్నేహితుడు ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ తర్వాత దానిని చూపించి కొన్ని నెలలపాటు ఆమెను లైంగికంగా వేధించాడు. 2018లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుడితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిందితుడి ఫ్లాట్‌లో వారు కలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో తీసి ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Read more