మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్‌.. దాడి

ABN , First Publish Date - 2022-08-27T13:06:15+05:30 IST

ఈరోడ్‌ జిల్లా పుంజై పులియంపట్టిలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్‌(Former MLA Eswaran)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి

మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్‌.. దాడి

                                  - పార్టీ మాజీ నేతపై అనుమానం?


అడయార్‌(చెన్నై), ఆగస్టు 26: ఈరోడ్‌ జిల్లా పుంజై పులియంపట్టిలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్‌(Former MLA Eswaran)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పార్టీకి చెందిన మాజీ నేత హస్తం వుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 45 ఏళ్ళ ఈశ్వరన్‌  2016 నుంచి 2021 వరకు అన్నాడీఎంకే(AIADMK) తరపున భవానీసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భుజంగనూరులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల24న ఈశ్వరన్‌ను కొందరు కిడ్నాప్‌ చేశారు. ఆయనపై దాడి చేయడంతో గాయపడ్డారు. ఈశ్వరన్‌కు సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు(Coimbatore) జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ కిడ్నాప్‌, దాడి ఘటనకు సంబంధించి పుంజై పులియంపట్టికి చెందిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కిడ్నాప్‌ ఘటనపై ఈశ్వరన్‌(Eswaran) మాట్లాడుతూ... ఈ నెల 24వ తేదీన ద్విచక్రవాహనంపై పులియంపట్టి నుంచి భవానీసాగర్‌కు వెళుతుండగా, ఆరుగురు వ్యక్తుల ముఠా తనను అడ్డగించి బలవంతంగా కారులో కిడ్నాప్‌ చేసిందని, అరగంట పాటు కారులోనే తిప్పిన ఆ ముఠా తనపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిందని వెల్లడించారు. చివరకు రూ.1.50 కోట్ల నగదు డిమాండ్‌ చేశారని, ఈ కిడ్నాప్‌ వెనుక పార్టీ మాజీ నేత మిలిటరీ శరవణన్‌ హస్తం ఉందని, అందుకే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2022-08-27T13:06:15+05:30 IST