police busts gang: మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాల సాకుతో ఘరానా మోసం...ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-09-19T17:43:59+05:30 IST

గిగోలో సేవలు(gigolo services) అందించేందుకు ఎస్కార్ట్ ఉద్యోగాలు ఇస్తామని వాట్సాప్, డేటింగ్ యాప్‌లలో(dating app) ప్రకటనలు ఇచ్చిన....

police busts gang: మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాల సాకుతో ఘరానా మోసం...ముఠా గుట్టురట్టు

న్యూఢిల్లీ: గిగోలో సేవలు(gigolo services) అందించేందుకు ఎస్కార్ట్ ఉద్యోగాలు ఇస్తామని వాట్సాప్, డేటింగ్ యాప్‌లలో(dating app) ప్రకటనలు ఇచ్చిన ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు(Delhi police) రట్టు చేశారు.(busts gang) ఢిల్లీకి చెందిన శుభం అహుజా, ఉదిత్ మెహతా, నేహా ఛాబ్రా, అర్చనా అహుజాలు ఎస్కార్టు ఉద్యోగాలు ఇస్తామంటూ వాట్సాప్, డేటింగ్ యాప్‌ల వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు ఇచ్చారు.గిగోలో సేవలు అందిస్తామనే నెపంతో ప్రజలను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు(arrest) చేశారు.రిజిస్ట్రేషన్ ఫీజులు, మసాజ్ కిట్‌లు, హోటల్ రిజర్వేషన్ల పేరుతో డబ్బులు అడిగేవారు. 


గత రెండేళ్లలో ఈ ఘరానా ముఠా 100 మందికి పైగా అమాయకులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. తనకు మగ మసాజర్ ఉద్యోగం (male masseur job)ఇస్తామని గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి వాట్సాప్ సందేశం వచ్చిందని అవ్నీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా బాగోతం వెలుగుచూసింది.వారిచ్చిన నంబర్‌కు డయల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం రూ.3,500 చెల్లించాలని కోరారు. డబ్బులు చెల్లించిన తర్వాత మసాజ్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్‌ కోసం రూ.12,600, ఎంట్రీ కార్డు క్రియేట్‌ చేసేందుకు రూ.15,500, రూమ్‌ బుక్‌ చేసుకునేందుకు రూ.9,400 ఇవ్వాలని అడిగారు.


పోలీసులు ఢిల్లీలోని జనక్ పార్కు హరినగర్ లో దాడులు చేసి ముఠా సభ్యులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డులు, మోసానికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 


Read more