విమానాశ్రయంలో 1.55 కిలోల Gold స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-16T16:41:40+05:30 IST

దుబాయ్‌, షార్జాల నుంచి మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. రూ.70 లక్షల విలువ చేసే 1.55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని

విమానాశ్రయంలో 1.55 కిలోల Gold స్వాధీనం

                                - ఇద్దరి అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): దుబాయ్‌, షార్జాల నుంచి మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. రూ.70 లక్షల విలువ చేసే 1.55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించిన ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్‌ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం, షార్జా నుంచి వచ్చిన ఎయిర్‌ అరేబియా విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. దుబాయ్‌ ప్రయాణికుల నుంచి 300 గ్రాముల బంగారు కడ్డీలను, షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా వుండగా విమానాశ్రయంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో పడివున్న గుర్తు తెలియని బ్యాగు నుంచి 960 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగు ఎవరిదన్నదానిపై విచారణ జరుగుతోంది. 

Read more