బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేసు నమోదు, అరెస్టు

ABN , First Publish Date - 2022-11-02T09:03:28+05:30 IST

నిబంధనలు అతిక్రమించిన ఆందోళన చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేసు నమోదు, అరెస్టు

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 1: నిబంధనలు అతిక్రమించిన ఆందోళన చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నెల 15 వరకు ఆందోళనలు, ర్యాలీలు, మానవాహారాలు తదితరాలకు పోలీసులు నిషేధం విధించారు. ఈ క్రమంలో, ఇటీవల కాలంలో ఖుష్బూ, నమిత, గాయత్రి రఘురామ్‌ సహా పలువురిపై డీఎంకే రాష్ట్ర ప్రతినిధి సైదై సాధిక్‌ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై సాదిక్‌పై పోలీసులు ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో, అతడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని బీజేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టారు. భారీవర్షం కురుస్తున్నా చేసిన ధర్నాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. అనుమతి లేకుండా ధర్నా చేశారంటూ అన్నామలై సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-11-02T09:03:28+05:30 IST
Read more