నాకీ బైక్ వద్దు బోర్ కొట్టింది.. కొత్తది కొనివ్వండి.. పెళ్లయిన ఏడాదికే భార్యతో ఓ భర్త గొడవ.. చివరకు..

ABN , First Publish Date - 2022-12-09T15:57:46+05:30 IST

ఆ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లి సమయంలో రూ.లక్ష, ఒక బైక్ కట్నంగా అందుకున్నాడు.. ఏడాది తిరిగే సరికి అతడికి ఆ బైక్ బోర్ కొట్టింది.. మరో బైక్ కొనిమ్మని భార్యను, అత్తింటి వారిని వేధించడం మొదలుపెట్టాడు.. దీంతో అత్తింటి వారు గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు..

నాకీ బైక్ వద్దు బోర్ కొట్టింది.. కొత్తది కొనివ్వండి.. పెళ్లయిన ఏడాదికే భార్యతో ఓ భర్త గొడవ.. చివరకు..

ఆ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లి సమయంలో రూ.లక్ష, ఒక బైక్ కట్నంగా అందుకున్నాడు.. ఏడాది తిరిగే సరికి అతడికి ఆ బైక్ బోర్ కొట్టింది.. మరో బైక్ కొనిమ్మని భార్యను, అత్తింటి వారిని వేధించడం మొదలుపెట్టాడు.. దీంతో అత్తింటి వారు గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు మధ్యవర్తులపై కాల్పులు జరిపాడు.. ఆ కాల్పుల్లో యువకుడి బావమరిది స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

బీహార్‌లోని అర్రా గ్రామానికి చెందిన చందన్ కుమార్‌ అనే వ్యక్తి 2021లో రామ్ కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో చందన్‌కు రూ.95 వేలు విలువ చేసే బైక్, రూ.లక్ష కట్నంగా ఇచ్చినట్టు అతని బావమరిది అభిరేంద్ర కుమార్ తెలిపాడు. ఏడాది అయ్యేసరికి ఆ బైక్ అంటే బోర్ కొట్టిందని, తనకు అపాచీ బైక్ కావాలని చందన్ అభిరేంద్రను అడిగాడు. కొత్త బైక్‌కు డబ్బులు అడిగి తేవాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో బావను అభిరేంద్ర కాస్త సమయం అడిగాడు. అయినా అభిరేంద్ర ఆగకుండా భార్యను శారీరకంగా హింసించడం ప్రారంభించాడు.

విషయం తెలుసుకున్న అభిరేంద్ర తన బావ ప్రవర్తన గురించి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలతో మాట్లాడేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న చందన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తుపాకీ తీసుకుని నేరుగా వెళ్లి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అభిరేంద్ర స్నేహితుడు కమలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తొడలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో బాగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-12-09T20:29:56+05:30 IST