కొత్త పెళ్లికొడుక్కి ఊహించని షాక్.. సెలూన్ షాప్‌నకు వెళ్లి ఫేసియల్‌ చేయించుకుని బయటకు వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-11-30T14:49:50+05:30 IST

మనందరం సాధారణంగా నెలకో, రెండు నెలలకో ఒకసారి హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం సెలూన్‌కు వెళ్తుంటాం. గురువారం పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఆ వరుడు కూడా సెలూన్‌కు వెళ్లాడు. పెళ్లి కదా అని ఫేషియల్, కటింగ్, బ్లీచింగ్ చేయించుకున్నాడు. తీరా బయటకు వచ్చి చూసి షాకయ్యాడు.

కొత్త పెళ్లికొడుక్కి ఊహించని షాక్.. సెలూన్ షాప్‌నకు వెళ్లి ఫేసియల్‌ చేయించుకుని బయటకు వచ్చి చూస్తే..

మనందరం సాధారణంగా నెలకో, రెండు నెలలకో ఒకసారి హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం సెలూన్‌కు వెళ్తుంటాం. గురువారం పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఆ వరుడు కూడా సెలూన్‌కు వెళ్లాడు. పెళ్లి కదా అని ఫేషియల్, కటింగ్, బ్లీచింగ్ చేయించుకున్నాడు. తీరా బయటకు వెళ్లి చూసేసరికి మెడలో గొలుసు కనిపించకుండా పోయింది. షాకైన యువకుడు వెంటనే సెలూన్‌కు వెళ్లి మొత్తం తనిఖీ చేశాడు. ఎక్కడా దొరకలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అసలు విషయం బయటపెట్టారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కునాల్ అనే యువకుడు గురువారం వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బాగా రెడీ అయ్యేందుకు బుధవారం ఉదయం స్థానిక సెలూన్‌కు వెళ్లి ఫేషియల్, కటింగ్, బ్లీచింగ్ చేయించుకున్నాడు. రూ. 3,100 చెల్లించి బయటకు వచ్చాడు. తన మెడలో ఉండాల్సిన గొలుసు కనిపించకపోవడంతో షాకయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి మొత్తమంతా వెతికాడు. ఎక్కడా గొలుసు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వారు కూడా సెలూన్ మొత్తం అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. చివరకు కునాల్‌కు హెయిర్ కటింగ్ చేసిన దీపక్ జోషి బట్టలు విప్పి తనిఖీ చేయగా, అతని లో దుస్తుల నుంచి గొలుసు బయటపడింది. పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-11-30T14:49:50+05:30 IST

Read more