ఆయుధాలతో దళిత కుటుంబాన్ని చంపేయత్నం

ABN , First Publish Date - 2022-06-29T21:45:32+05:30 IST

ఆధిపత్య కులానికి చెందిన కొంత మంది ఒక దళిత కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతుల్లో ఆయుధాలు పట్టుకుని దళిత కుటుంబాన్ని వెంబడిస్తున్న పాశవిక దృశ్యం నెటిజెన్లను కదిలిస్తోంది. జర్ఖండ్‌లోని పోటందగ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం..

ఆయుధాలతో దళిత కుటుంబాన్ని చంపేయత్నం

రాంచీ: ఆధిపత్య కులానికి చెందిన కొంత మంది ఒక దళిత కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతుల్లో ఆయుధాలు పట్టుకుని దళిత కుటుంబాన్ని వెంబడిస్తున్న పాశవిక దృశ్యం నెటిజెన్లను కదిలిస్తోంది. జర్ఖండ్‌లోని పోటందగ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. పొలాల్లో కర్రలు, ఇతర పదునైన ఆయుధాలతో ఉన్న కొద్ది మంది గుంపు ఒక కుటుంబం మీదకు ఆవేశంతో వచ్చి దాడికి దిగింది. బాధితులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోలో ‘ఎలా కొడుతున్నారో చూడండి.. చంపడానికి వచ్చారు’ అంటూ బాధితులు అనడం స్పష్టంగా వినిపిస్తోంది. బాధితులు అలా అంటున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి వెనకున్న కారణాలు ఇంకా తెలియలేదు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more