వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. ఆమె భర్త ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-11-20T14:36:29+05:30 IST

ఆ మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది.. వివాహం అయిన నాటి నుంచి ఆమెను అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.. పలుమార్లు పంచాయతీ జరిగినా అత్తమామల తీరు మారలేదు.. దీంతో గురువారం రాత్రి..

వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. ఆమె భర్త ఏం చేశాడంటే..

ఆ మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది.. వివాహం అయిన నాటి నుంచి ఆమెను అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.. పలుమార్లు పంచాయతీ జరిగినా అత్తమామల తీరు మారలేదు.. దీంతో గురువారం రాత్రి ఆ మహిళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది.. భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న భర్త తీవ్ర విచారానికి లోనయ్యాడు.. అతను విషం తాగేశాడు.. ప్రస్తుతం ప్రాణాంతక స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.. రాజస్థాన్‌లోని (Rajasthan) బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బార్మర్ జిల్లాలోని కాగోవు గ్రామానికి చెందిన టిప్పుదేవి(23)కి మూడేళ్ల క్రితం తగరాం(25)తో వివాహమైంది. పెళ్లయిన తర్వాత అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని టిప్పు దేవి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పెద్దలు సర్ది చెప్పినా అత్తమామల తీరు మారలేదు. కట్నం కోసం టిప్పును వేధిస్తూనే ఉండేవారు. భర్త తగరాం అమాయకుడు కావడంతో టిప్పు దేవి మరిన్ని కష్టాలు ఎదుర్కొంది. చివరకు వేధింపులు తాళలేక గురువారం రాత్రి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న టిప్పు దేవి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. టిప్పు అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టిప్పు దేవి చినిపోయిన విషయం తెలుసుకున్న తగరాం వెంటనే విషం తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన తగరాంను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. టిప్పు దేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు టిప్పు దేవి అత్తమామలపై గృహ హింస కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-11-20T14:38:20+05:30 IST

Read more